Rajinikanth: బాలు మరణం ఆయన్ను కుంగదీసింది..

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:00 PM

సంగీతం దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) గాన గంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం మధ్య స్నేహబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్


సంగీతం దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) గాన గంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం (SP Balu) మధ్య స్నేహబంధం గురించి గుర్తుచేసుకున్నారు రజినీకాంత్(Rajinikanth) . ఎస్పీబీ మరణం ఇళయరాజాను ఎంతగానో కలచివేసిందని ఆయన అన్నారు. తన సోదరుడు, భార్య, కుమార్తె చనిపోయినా కంటతడి పెట్టుకోకుండా ధైౖర్యంగా ఉన్న ఆయన బాలు మరణాన్ని తట్టుకోలేకపోయారని, భావోద్వేగంతో కన్నీరుమున్నీరయ్యారని అన్నారు. ఇళయరాజా సంగీత ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడారు.  ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. తాను హీరోగా నటించిన ‘జానీ’ సినిమా సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలను గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ ుఇళయరాజాకు ఇసైజ్ఞాని అనే బిరుదును కరుణానిధి 1988లో యాదృచ్ఛికంగా అందించారు. ఇళయరాజా లేకుండా జోల పాటలు, యువతకు ప్రేమ గీతాలు లేవన్నారు.
తానెప్పుడూ ఇళయరాజాకు పీఆర్‌వోనే అని కమల్‌ హాసన్‌ అన్నారు.  

Updated Date - Sep 14 , 2025 | 11:00 PM