Sivakarthikeyan: శివకార్తికేయన్ ఉదారత.. మాటిచ్చి ఏడేళ్ళుగా రహాస్య సాయం
ABN , Publish Date - Jun 20 , 2025 | 07:58 AM
హీరోగా ఎంత పెద్ద పొజీషన్‌లో ఉన్నప్పటికీ తను వచ్చిన మార్గాన్ని మరువక తన పనుల ఇతర నటులకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నాడు శివకార్తికేయన్ .
శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఈ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం తెలుగు ప్రక్షకులకు లేదు. వరుణ్ డాక్టర్, అమరన్ వంటి సినిమాలతో ఇక్కడా స్టార్ హీరో లిస్టులో చేరి పోయారు. అయితే హీరోగా ఎంత పెద్ద పొజీషన్‌లో ఉన్నప్పటికీ తను వచ్చిన మార్గాన్ని మరువక తానేంటో తన పనుల ద్వారా చాటి చెబుతూ తనను అభిమానించే వారికి ఇతర నటులకు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన అప్పెడెప్పుడో మరణించిన తమిళ రైతు నాయకుడికి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికీ సాయం చేస్తూ వస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ఓ దర్శకుడు ఐ.శరవణన్ (Era Saravanan) ఈ విషయాలను బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నా సోదరుడు నెల్ జయరామన్ (Nel Jayaraman) మరణించినపుడు తన సోదరుడి కుమారుడు శ్రీనివాసన్ విద్యా ఖర్చులను భరిస్తానని శివకార్తికేయన్ (Siva Karthikeyan) మాట ఇచ్చారని, ఆ మాట తప్పకుండా గత ఏడేళ్ళుగా విద్యా ఖర్చులను భరిస్తున్నారని తెలిపారు.
సాధారణంగా కష్టకాలంలో ఉన్న సమయంలో మాట ఇచ్చే కొందరు ఆ తర్వాత దాన్ని విస్మరిస్తుంటారు. కానీ, శివకార్తికేయన్ మాత్రం గత ఏడేళ్ళుగా మొత్తం ఖర్చులను భరించడమే కాకుండా ప్రతి యేటా పబ్లిక్ పరీక్షల సమయంలో ఫోన్ చేసి అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. శ్రీనివాసన్ ఇపుడు కోయంబత్తూరులోని కర్పగం కాలేజీలో చేర్చారు. ఇలా ఇచ్చిన మాటను కాపాడుకోవడం చాలా అరుదని, అలాంటి అరుదైన వ్యక్తుల్లో శివకార్తికేయన్ ఒకరని దర్శకుడు శరవణన్ అన్నారు.
అయితే ఆలస్యంగా ఈ విషయం బయటకు రావడం, ఎలాంటి ప్రచార ఈర్బాటాలు లేకుండా శివ కార్తికేయన్ ఇలాంటి సాయం అందించడంపై నెటిజన్లు వేల మంది స్పందిస్తున్నారు. శివకార్తికేయన్ (Siva Karthikeyan) రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా తెలియకుండా ఇలాంటి సాయాలు ఇంకా ఎన్ని చేస్తున్నాడో అంటూ ఫ్యాన్స్ అతనికి హ్యాట్సాప్ చెబుతూ తమ అభిమాన హీరో గురించి పది మందికి గర్వంగా చెప్పుకుంటున్నారు.