Hemanth: న‌టికి లైంగిక వేదింపులు.. దర్శక, నిర్మాత అరెస్టు

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:39 AM

లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మంగళవారం దర్శకుడు, నిర్మాత హేమంత్‌ కుమార్‌ను అరెస్టు చేశారు.

Hemanth

కన్నడ దర్శకుడు, నిర్మాత హేమంత్‌ కుమార్ (34) (Hemanth Kumar)ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బిగ్‌బాస్‌ ఫేం, ‘రిచ్చి’ సినిమా నటి ఫిర్యాదు మేరకు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. 2022లో బిగ్‌బాస్ (BiggBoss) ద్వారా పేరు సంపాదించిన ఓ యువతికి హేమంత్‌ కుమార్‌ పరిచయం అయ్యారు. తాను తీస్తున్న ‘రిచ్చి’ (Ricchi) సినిమాలో నటించాలని ఆఫర్‌ ఇచ్చారు. ఆమెకు రూ.2 లక్షలు పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని, అందులో రూ.60 వేలు చెల్లించారు. అశ్లీల దుస్తులు ధరించాలని, అదే తరహాలో నటించాలని ఆమెపై హేమంత్‌ ఒత్తిడి తెచ్చారు.

షూటింగ్‌ ముగిశాక ఆమెకు ఇచ్చిన పేమెంట్‌ చెక్‌ బౌన్స్‌ అయింది. డబ్బులు అడిగితే ప్రాణాలు తీస్తామని హేమంత్‌ బెదిరించారు. మధ్యవర్తుల జోక్యంతో 2023 ఆగస్టు 5న ముంబైలో జరిగిన సినిమా ప్రచారానికి నటి వెళ్లారు. ఆమె వాష్‌రూంకు వెళ్ళి వచ్చేసరికే కూల్‌డ్రింక్‌లో హేమంత్‌ మత్తు మందు కలిపారు. అది తాగి స్పృహ కోల్పోయిన బాధితురాలిని అశ్లీలంగా వీడియోలు తీశారు. వాటిని చూపించి, లైంగిక చర్యలకు ఒప్పుకోవాలని, లేదంటే వీడియోలు బయట పెడతామని బెదిరించారు.. ఈ విషయమై తాను ఇప్పటికే ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానని, మరో మార్గం లేక పోలీసులకు సమగ్ర వివరాలతో ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు పేర్కొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 06:39 AM