Bharathiraja: 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న సినిమా అవార్డులు ఇవ్వండి
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:44 PM
2016 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సినిమా అవార్డులను ప్రదానం చేయాలని భారతీరాజా సారథ్యంలోని తమిళ సినీ నిర్మాతల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2016 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సినిమా అవార్డులను ప్రదానం చేయాలని భారతీరాజా (Bharathiraja) సారథ్యంలోని తమిళ సినీ నిర్మాతల సంఘం (యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) (Tamil Film Active Producers Association) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
‘ఇందులో తమిళ సినిమాల నుంచి వసూలు చేసే ఎల్.బి.ఈ.టి 8 శాతం నుంచి 4 శాతానికి తగ్గించినందుకు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధికి, తమిళ చిత్రపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే 2016 నుంచి 2022 వరకు తమిళ చిత్రాలకు అవార్డులు, రాయితీలు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ, ఏడేళ్ళుగా అవార్డులతో పాటు సబ్సీడీ ప్రకటించలేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి, ఏడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న అవార్డులను ప్రదానం చేయాలని యాక్టివ్ నిర్మాతల సంఘం ఒక ప్రకటనలో కోరింది.