Mohanlal: ఇది మోహన్ లాల్ సినిమానేనా అనేంతగా..
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:31 PM
మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని చక్రవర్తి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Complete actor Mohan Lal). యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ, కెరీర్‌లో ఏమాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రకరకాల ఫలితాలను చూశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని చక్రవర్తి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Complete actor Mohan Lal). యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ, కెరీర్‌లో ఏమాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రకరకాల ఫలితాలను చూశారు. ఈ ఏడాది మోహన్ లాల్ కెరీర్‌లో గర్వించదగ్గ మైలురాయి ఎల్-2 ఎంపురన్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రం మల్లూవుడ్ చరిత్రనే తిరగరాసింది. కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన ఈ సినిమా.. మల్లూవుడ్ ఇండస్ట్రీకి మొదటి 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి పెట్టింది. ఈ విజయంతో మోహన్ లాల్ రేంజ్ మరోసారి ఆకాశానికి తాకింది. (Vrusshabha)
ఎంపురాన్ సృష్టించిన ప్రభంజనం తగ్గకముందే, కేవలం రెండు నెలల వ్యవధిలోనే తుడరుమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్ లాల్. ప్రారంభంలో ఈ సినిమాపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఇది సక్సెస్ అయ్యింది. ఫలితంగా లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఏకంగా 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇదే ఊపులో వచ్చిన హృదయ పూర్వం సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం తోపాటు, అదే సమయంలో కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో వచ్చిన లోకా మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో హృదయ పూర్వం వసూళ్లు తగ్గిపోయాయి. పోటీని తట్టుకోలేక ఈ సినిమా రేసులో వెనుకబడిపోయింది.
ఇక ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా వృషభ. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు, మలయాళం మినహా ఇతర భాషల్లో ప్రమోషన్లు సరిగా చేయకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరవ కాలేదు. ఫలితం ఎలా ఉందంటే.. మొదటి రోజు కలెక్షన్లు కనీసం 70 లక్షలు కూడా దాటలేదు. మలయాళంలో 46 లక్షలు, తెలుగులో 13 లక్షలు, హిందీలో 2 లక్షలు సాధించడంతో ఇది మోహన్‌లాల్ సినిమానేనా అనే ఫీలింగ్ రాక మానదు. మోహన్‌లాల్ కెరీర్‌లో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వృషభ అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 300 కోట్ల క్లబ్‌తో మొదలైన ఈ ఏడాది.. వృషభ వంటి పరాజయంతో ముగియడం ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేస్తోంది. అయినప్పటికీ, ఒకే ఏడాదిలో 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మోహన్ లాల్ తన సత్తా చాటారు. మరి వచ్చే ఏడాది మోహన్‌లాల్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి