Faria Abdullah: సమ్ థింగ్ డిఫరెంట్ క్యారెక్టర్...

ABN, Publish Date - May 03 , 2025 | 04:07 PM

ఫరియా అబ్దుల్లా ఇప్పుడో కొత్త ఛాన్స్ ను దక్కించుకుంది. అయితే ఆమె కోలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది!

నాలుగేళ్ళ క్రితం 'జాతిరత్నాలు' (Jathi Ratnalu) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆరడుగుల అందగత్తె ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)! ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత పలు అవకాశాలు ఆమెను వెత్తుకుంటూ వెళ్ళాయి. అలానే అక్కినేని ఫ్యామిలీకి చెందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Most Eligible Bachelor) లోనూ, 'బంగార్రాజు' (Bangarraju) లోనూ అతిథిపాత్రలో మెరిసిందీ బ్యూటీ. ఆపైన సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' (Like, Share & Subscribe) లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2023లో రవితేజ 'రావణాసుర' (Ravanasura) లో కీలక పాత్రను పోషించింది ఫరియా. బట్... ఈ సినిమాలేవీ ఆమెకు నటిగా గుర్తింపును కానీ విజయాన్ని గానీ అందించలేదు. అయితే లక్కీగా గత యేడాది మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. 'అల్లరి' నరేశ్‌ 'ఆ ఒక్కటీ అడక్కు', సింహా కోడూరి 'మత్తు వదలరా -2' చిత్రాల్లో నటించింది ఫరియా. ఇందులో మొదటిది ఫ్లాప్ కాగా రెండోది ఫర్వాలేదనిపించింది. ఇదే సంవత్సరం 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 AD) లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇలా ఆన్ అండ్ ఆఫ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్న ఫరియా అబ్దుల్లాకు ఇప్పుడో కొత్త సినిమాలో ఛాన్స్ దక్కింది.


'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చింది. ఆమెది రొటీన్ భిన్నమైన పాత్ర అనేది అర్థమౌతోంది. అయితే... ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఫరియా అబ్దుల్లా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న 'వల్లి మయిల్'లో హీరోయిన్ గా నటించింది. 2022లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ వచ్చినా... ఆ తర్వాత ఎవ్వరూ ఈ సినిమా గురించి చర్చించుకోవడమే మానేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'వల్లి మయిల్' (Valli Mayil) మూవీ ఎప్పుడు వెలుగు చూస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫరియా నటించిన తెలుగు సినిమాలు సైతం పెద్ద విజయాన్ని అందుకోక పోవడంతో ఆమెకు తమిళ సినిమాల్లోనూ ఆఫర్స్ వస్తున్నట్టుగా లేవు. మరి నరేశ్‌ అగస్త్య మూవీతో అయినా... మళ్ళీ ఆమె కెరీర్ ఊపు అందుకుంటుందేమో చూడాలి.

Also Read: Good Bad Ugly OTT: అప్పుడే ఓటీటీకి.. అజిత్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్! ఎందులో.. ఎప్ప‌టి నుంచంటే? ఇప్పుడైనా చూస్తారా!

Also Read: Vijay Devarakonda: అందరి వేలు అతనివైపే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 03 , 2025 | 04:07 PM