Kamal Haasan: ఎన్ని కోట్లు నష్టం వస్తే నాకేంటి.. ఆపేసుకోండి సినిమా..?
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:03 PM
లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. స్టేజిపై కమల్ అన్న ఒక్క మాట దావానంలా వ్యాపించి కన్నడనాట మంటలు వ్యాపించాయి.
లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. స్టేజిపై కమల్ అన్న ఒక్క మాట దావానంలా వ్యాపించి కన్నడనాట మంటలు వ్యాపించాయి. అటు ఇటు అనుకుంటూ కోర్టు వరకు వెళ్లినా కూడా ఈ వివాదం సమసిపోలేదు. అందుకు కారణం కమల్ తగ్గకపోవడం. తాను అన్న మాటలకు ఒక్క సారీ అడిగితే చాలు అని కోర్టు చెప్పినా కూడా కమల్ మాట వినే పొజిషన్ లో లేడు. దీంతో కన్నడలో కమల్ నటించిన థగ్ లైఫ్(Thug Life) ను రిలీజ్ చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు.
అప్పుడు కూడా కమల్ తగ్గలేదు. కన్నడలో రిలీజ్ కాకపోయినా నష్టం లేదు అన్నట్లు మాట్లాడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కన్నడలో ఈ సినిమా రిలీజ్ ఆగిపోతే వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. ఒక్క కన్నడ నుంచే దాదాపు రూ. 12- 13 కోట్లు కలక్షన్స్ వస్తాయి. ఆ కోట్లతో కూడా నాకు సంబంధం లేదు. నేను సారీ చెప్పను అని కమల్ మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడు.
అయితే సినిమా అంటే కమల్ ఒక్కడే కాదు.. డైరెక్టర్, నిర్మాత అని చాలామంది ఉంటారు. ఇంకా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా వారందరికీ సమాధానం చెప్పాలి కదా అంటే.. ఈ సినిమాకు నిర్మాత కమల్ హాసనే. మణిరత్నం బ్యానర్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అందుకే.. కమల్ ఇంత ధీమాగా ఉన్నాడా.. ? అంటే నిజమే అని చెప్పొచ్చు. ఇక ఎంత ప్రెషర్ పెట్టినా కమల్ తాను అన్న మాటమీదనే నిలబడడంతో తమిళ్ తంబీలు.. కమల్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
కోట్లు నష్టం వస్తున్నా కూడా క్షమించమని కోరని కమల్ వ్యక్తిత్వానికి తాము కూడా సపోర్ట్ చేస్తున్నామని పోస్టులు పెడుతున్నారు. కమల్ పై ప్రేమతో, తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(TFAPA) .. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(KFCC) కి లేఖ రాసింది. కమల్ అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని, దయచేసి జూన్ 5 న సినిమా రిలీజ్ చేయడానికి అనుమతిని ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.
ఎన్నో ఏళ్లుగా.. కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలు కలిసి పని చేస్తున్నాయని, ఇక్కడ వారు అక్కడ.. అక్కడ వారు ఇక్కడ నటిస్తున్నారని.. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కన్నడవారు తీసుకున్న నిర్ణయం రెండు ఇండస్ట్రీలను వేరు చేసేలా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను బ్యాన్ చేస్తే.. రెండు ఇండస్ట్రీలలో ఉన్న అనుబంధం దెబ్బతింటుందని, అలా జరగకుండా థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయమని కోరారు. మరి ఈ లేఖపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.