Diya Duriya: ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్‌లో.. సూర్య కూతురి సినిమా
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:58 AM
తమిళ స్టార్ సూర్య, జ్యోతిక (Suriya Jyothika) దంపతుల కుమార్తె దియా సూర్య (Diya Suriya)అతి చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టింది.
తమిళ స్టార్ సూర్య, జ్యోతిక (Suriya Jyothika) దంపతుల కుమార్తె దియా సూర్య (Diya Suriya)అతి చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టింది. ఆమె వయసు 17 సంవత్సరాలు. ‘లీడింగ్ లైట్స్’ (leading Lights) అనే డాక్యుమెంటరీతో దర్శకురాలిగా పరిచయమవుతుంది. 13 నిమిషాల నిడివి గల బాలీవుడ్ డాక్యుమెంటరీ ఇది. మహిళా గాఫర్స్.. అంటే సినిమా సెట్లలో లైటింగ్ పని చేసే నిపుణుల ఇతివృత్తంతో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. పురుషాధిక్యత గల సినిమా రంగంలో లేడీ గాఫర్స్ కష్టాలు, సవాళ్లు, డెడికేషన్ ఎలా ఉంటాయన్న అంశాలతో దియా ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. హేతాల్ దెద్డియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్దే అనే ముగ్గురు మహిళా గాఫర్లు తమ అనుభవాలు, శారీరక, మానసిక సవాళ్లను స్త్రీలపై ఉన్న లింగ వివక్షను ఎలా అధిగమించారో ఇందులో చెప్పబోతున్నారు.
ఇప్పుడీ చిత్రం ఆస్కార్ క్వాలిఫైయిలంగ్ రన్‌లో (Oscar Qualifying run) ప్రదర్శించబడుతోంది. లాస్ ఏంజెల్స్‌లోని రెగెన్సీ థియేటర్‌లో సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా ప్రదర్శన జరగనుంది. ఈ స్ర్కీనింగ్ వల్ల 2026 ఆస్కార్స్‌కు షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మా కూతురు దియా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆస్కార్ వేదికపై స్ర్కీనింగ్ కావడం గర్వంగా ఉంది. దియా మంచి కథ ఎంపిక చేసుకుంది. బాలీవుడ్ గాఫర్స్ జీవితాల్ని, వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి చెప్పే సినిమా ఇది’ అని చెప్పారు.