NTR: సూపర్ స్టార్ కోసం ఎన్టీఆర్ నే పక్కన పెట్టిన డైరెక్టర్..
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:36 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో వీజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో వీజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. డ్రాగన్ తరువాత ఎన్టీఆర్.. తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నెల్సన్.. రజినీకాంత్ (Rajinikanth) తో జైలర్ 2 ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అవ్వగానే ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కిస్తాడని టాక్.
అయితే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ - నెల్సన్ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా లేదని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందుకు కారణం రజినీకాంత్ అని అంటున్నారు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకొని ట్రోల్ల్స్ మధ్య కొట్టుమిట్టాడుతున్న నెల్సన్ కి.. జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందించాడు రజినీ. అందుకే ఆయన అంటే నెల్సన్ కు అమితమైన అభిమానం. ఇక ప్రస్తుతం జైలర్ 2 తో ఇంకోసారి ఇండస్ట్రీని షేక్ ఆడించాలని చూస్తున్నాడు. అలాంటి హీరో నుంచి మూడోసారి కూడా దర్శకత్వం చేయమని ఆఫర్ వస్తే నెల్సన్ వదులుకుంటాడా.. ? పట్టేసుకున్నాడని టాక్.
రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ బ్యానర్ లో తలైవర్ 173 మొదలైన విషయం తెల్సిందే. సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ముందు చెప్పారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి సుందరి సి తప్పుకున్నాడు. ఇక ఆయన ప్లేస్ లో ఏ డైరెక్టర్ వస్తాడో అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఎట్టకేయాలకు ఆ డైరెక్టర్ నెల్సనే అని టాక్ నడుస్తోంది. జైలర్ 2 తరువాత.. తలైవర్ 173 ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట నెల్సన్. సూపర్ స్టార్ కోసం ఎన్టీఆర్ తో సినిమాను వాయిదా వేశాడని సమాచారం.
ఇక నెల్సన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ త్రివిక్రమ్ చేతికి చిక్కింది. ఎన్టీఆర్ తో.. కుమారస్వామి కథను గురూజీ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మధ్యలో నెల్సన్ ఉండడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం పడుతుంది అని అనుకున్నారు. కానీ, నెల్సన్ అవుట్ అవ్వడంతో.. త్రివిక్రమ్ ముందుకొచ్చాడు. డ్రాగన్ తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమానే పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.