Anudeep KV: రష్మికతో.. అనుదీప్ కొత్త ప్రయోగం! ఇదసలు.. ఊహించలే
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:06 PM
నవ్వుల తుఫాను సృష్టించిన డైరెక్టర్ కె.వి అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నవ్వుల తుఫాను సృష్టించిన డైరెక్టర్ కె.వి అనుదీప్ KV Anudeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిట్టగోడ (pittagoda) లాంటి డీసెంట్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా, 'జాతి రత్నాలు' (jathi ratnalu) సినిమాతో ఆయన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా సృష్టించిన కామెడీ సునామీ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి ఉంది. ఆయన దర్శకత్వ ప్రతిభతో పాటు, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్, అప్పుడప్పుడు సినిమాల్లో ఇచ్చే క్యామియో అప్పీరెన్సులు కూడా సినిమా సక్సెస్‌కి మరింత బలాన్ని చేకూర్చాయి. అందుకే అనుదీప్ అంటే కేరాఫ్ అడ్రస్ కామెడీ అనే ముద్ర పడిపోయింది. అయితే, జాతి రత్నాలు తర్వాత అనుదీప్, శివకార్తికేయన్‌తో తీసిన ప్రిన్స్ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన విశ్వక్ సేన్, కయాదు లోయర్‌తో కలిసి ఫంకీ అనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా మొదట్లో క్రిస్మస్ బరిలో ఉంటుందని టాక్ వినిపించినా, ప్రమోషన్స్ ప్రారంభం కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే ఫంకీ రిలీజ్ డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ లోపే, అనుదీప్ కెరీర్‌లోనే ఒక పెద్ద సంచలనానికి తెరలేపిన వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదేమిటంటే... ఇప్పటివరకు కామెడీ కథలకే పరిమితమైన అనుదీప్, తొలిసారిగా రూటు మార్చి, ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట. అనుదీప్ కామెడీ టైమింగ్ ఎంత పవర్‌ఫుల్లో అందరికీ తెలుసు. మరి ఆయన సీరియస్ కథను ఎలా డీల్ చేస్తారు, కథనం ఏ స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీరియస్ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అనుదీప్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సీరియస్ చిత్రంలో రష్మిక లీడ్ రోల్ పోషించబోతోందని సమాచారం.

రష్మిక ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటోంది. ఇటీవల విడుదలైన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ఆమె నటన చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కేవలం తన పెర్ఫార్మెన్స్‌తోనే మిగతా నటీనటులను, కథను డామినేట్ చేసే సత్తా రష్మికకు ఉంది. ప్రస్తుతం ఆమె మైసా లాంటి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు అనుదీప్‌తో చేయబోయే సినిమా కూడా ఒక నవ్వుల పండుగలా కాకుండా, ఒక సాలిడ్ ఎమోషనల్ అండ్ సీరియస్ డ్రామాగా తెరకెక్కబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుదీప్, తన మొదటి సీరియస్ అటెంప్ట్‌ను రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌తో చేస్తుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఫంకీ సినిమా రిలీజ్ తర్వాత, అనుదీప్ ఈ సీరియస్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అనుదీప్ కామెడీకి అలవాటు పడిన ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభవాన్ని ఇవ్వడం ఖాయం.