AR Murugadoss: గజని, తుపాకీ త‌ర‌హాలో.. మ‌ద‌రాసి

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:09 AM

‘మదరాసి’ సినిమా తనకు ఒక కమ్‌బ్యాక్‌ మూవీగా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

AR Murugadoss

శివకార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా రుక్మిణీ వ‌సంత్ (Rukmini Vasanth) హీరోయున్‌గా తాను రూపొందిస్తున్న ‘మదరాసి’ (Madharasi) సినిమా తనకు ఒక కమ్‌బ్యాక్‌ మూవీగా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్ (ARMurugadoss) గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కించిన ‘సికిందర్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ‘మదరాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిపై దర్శకుడు మురుగదాస్‌ మాట్లాడుతూ, ‘ఈ మూవీ ఖచ్చితంగా నాకు ఒక కమ్‌బ్యాక్‌లా ఉంటుందన్నారు.

సూర్య నటించిన ‘గజని’ (Ghajini) సినిమా స్క్రిప్టు, విజయ్‌ ‘తుపాకీ’ (Thuppakki) మూవీ యాక్షన్‌ సమ్మేళనంతో ఈ మూవీని రూపొందిస్తున్నాను. అందుకే ఈ సినిమా అభిమానులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ‘మదరాసి’ అనే పదాన్ని ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా తమిళులను ఉద్దేశించి ఈ పదం వాడుతారు. తద్వారా ఏర్పడే సమస్యలు ఏంటో ఇందులో చూపించాం.

పైగా ‘గజిని’ మూవీలో హీరో సూర్యకు ఉన్నట్టుగానే ఇందులో శివకార్తికేయన్‌కు ఒక మానసిక సమస్య ఉంటుంది. ఈ సమస్యలను హీరో ఎలా అధిగమించారన్నదే ఈ చిత్ర మూలకథ’ అన్నారు. కాగా, అనిరుధ్ (Anirudh) సంగీతం సమకూర్చిన ఈ చిత్రం సెప్టెంబరు 5వ తేదీన విడుదల చేసేలా ప్లాన్‌ చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 10:49 AM