BHA BHA BA: భయం భక్తి, బహుమానం.. మోహన్ లాల్ కొత్త మూవీ ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Dec 11 , 2025 | 09:38 AM
మలయాళ అగ్ర నటుడు దిలీప్ (Dilieep) హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం భా భా బా.
మలయాళ అగ్ర నటుడు దిలీప్ (Dilieep) హీరోగా తెరకెక్కిన నూతన చిత్రం భా భా బా (భయం భక్తి, బహుమానం) BHA BHA BA . ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ గోకులం పిక్చర్స్ (Sree Gokulam Movies) గోపాలన్ ఈ సినిమాను నిర్మించగా సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) క్రుషియల్ రోల్ చేయడం విశేషం. వినీత్ శ్రీనివాసన్ (Vineeth Sreenivasan), ద్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan), శాండీ, బాలు వర్గీస్, శరణ్య , రెండ్ కింగ్‌స్లే కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదలకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తే దిలీప్ గతంలో ఎన్నడు చేయని మాస్, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో దర్ణమిచ్చి అందరికీ షాకిచ్చాడు. ఇక ట్రైలర్ చివరలో మోహన్ లాల్ ఎంట్రీ సీన్లతో గూస్మంప్స్ తెప్పించారు. మీరూ ఓ లుక్కేయండి.