Nagesh: క‌మెడియ‌న్ నగేష్‌ మనవడు.. హీరోగా ‘వానరన్‌’

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:32 PM

దివంగత హాస్య నటుడు నగేష్‌ మనవడు బిజేష్‌ నాగేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

vanaran

దివంగత హాస్య నటుడు నగేష్‌ మనవడు బిజేష్‌ నాగేష్ (Bijesh nagesh) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.. ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెరకెక్కిన ‘వానరన్‌’ (Vanaran) చిత్రం ఆడియో ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక ఇటీవ‌ల చెన్నైలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai) ముఖ్య అతిథిగా హాజరై ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఒక సినిమా వేడుకకు తొలిసారి వచ్చాను. ‘రామా’పురానికి చెందిన నిర్మాతలు హనుమంతుడుపై సినిమా తీశారు. మాజీ గవర్నర్‌, రాజకీయ నేతగా ఇక్కడకు రాలేదు. రాముడు, హనుమంతుడి భక్తురాలిగా మాత్రమే వచ్చాను. హనుమంతుడే నన్ను ఇక్కడకు ఆహ్వానించినట్టుగా భావిస్తున్నాను. ఈ చిత్రానికి హనుమంతుడే విజయాన్ని చేకూరుస్తాడు’ అని పేర్కొన్నారు.

bijesh.jpg

ఈ వేడుకకు అతిథిగా వచ్చిన సినీ నటి కస్తూరి మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది జైశ్రీరామ్‌ అనే నినాదంతో ప్రారంభంకావడం మరింత ఆనందంగా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాల్లో పెద్ద చిన్న బడ్జెట్‌ ముఖ్యం కాదు.. మంచి స్టోరీ. ఈ విషయాన్ని టూరిస్ట్‌ ఫ్యామిలీ మరోమారు నిరూపించింది. చిన్న బడ్జెట్‌ చిత్రాలకు వినోదపు పన్నును పూర్తిగా రద్దు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్న చిత్రాలు సక్సెస్‌ సాధిస్తే చిత్రపరిశ్రమ బాగుంటుంది’ అని పేర్కొన్నారు. కాగా, చిత్రంలో బిజేష్‌ నాగేష్‌, అక్షయ లొల్లుసభ జీవ, దీప శంకర్‌, ఆదేశ్‌ బాలా, నాంజిల్‌ వినయ్‌, బేబీ వర్ష్‌ తదితరులు నటించారు.

vanaran.jpg

Updated Date - Jun 04 , 2025 | 01:32 PM