Rishab Shetty: రిషబ్ శెట్టిలో ఉన్న చిత్రాలు, విచిత్రాలు ఎన్నో.. చదివేయండి  

ABN , Publish Date - Oct 05 , 2025 | 09:22 AM

'నాకు ఒక విచిత్రమైన మూఢనమ్మకం ఉంది. బయటకి వెళ్లేముందు జేబులో కచ్చితంగా ఒక కాయిన్‌ పెట్టుకుంటా' అంటూ తనలో ఉన్న ఉన్న కొన్ని గుణాలు చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి

'నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఇంట్లో కన్నా క్రికెట్‌ మైదానంలోనే ఎక్కువగా గడిపేవాడిని. ఇప్పటికీ నా కారులో క్రికెట్‌ కిట్‌ ఉంటుంది. షూటింగ్‌ మధ్యలో విరామం దొరికితే సెట్‌లో ఆట మొదలెట్టేస్తా. నా ఫేవరెట్‌ క్రికెటర్‌ సౌరబ్‌ గంగూలీ' అని రిషబ్ శెట్టి అన్నారు.  ‘కాంతార’తో యావత్‌ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు  రిషబ్‌ శెట్టి(Rishab Shtty) . ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’(Kantara Chapter 1) తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌ కమ్‌ యాక్టర్‌ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...

వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు   
కాలేజీ రోజుల్లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలెట్టా. నీళ్లు సప్లై చేశాక వ్యానులోనే రాత్రిళ్లు నిద్రపోయేవాడిని. ఆ తర్వాత హోటల్‌ బిజినెస్‌ పెట్టా. ఐదు నెలల్లోనే నష్టాలు చవిచూశా. రూ.25 లక్షల అప్పు మిగిలింది. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పుల వాళ్ల నుంచి తప్పించుకునేందుకు మారువేషాల్లో తిరిగేవాడిని. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే కళ్లు చెమ్మగిల్లుతాయి.

Rishab-shetty.jpg
రజనీ సార్‌... గోల్డ్‌ చైన్‌ ఇచ్చారు

‘కాంతార’ సినిమా చూశాక రజనీ సార్‌ తన ఇంటికి ఆహ్వానించారు. నేను చెన్నై వెళ్లి ఆయన్ని కలిశాను. గంటసేపు మాట్లాడుకున్నాం. కొన్ని సన్నివేశాల గురించి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ‘కాంతార’ లాంటి అరుదైన సినిమాలు 50 ఏళ్లకు ఓసారి వస్తాయన్నారు. బాబా లాకెట్‌ ఉన్న గోల్డ్‌ చైన్‌ బహుమతిగా ఇచ్చారు. అది నాకు ఎంతో ప్రత్యేకం.

డూప్‌ లేకుండా...
‘కాంతార: చాప్టర్‌ 1’ షూటింగ్‌లో నాలుగుసార్లు ప్రమాదం జరిగింది. చనిపోయేవాడినే... కానీ ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. ఇందులో ఒక్క యాక్షన్‌ సన్నివేశంలో కూడా డూప్‌ ఉపయోగించలేదు. నేనే రిస్క్‌ చేసి స్టంట్స్‌ చేశాను. ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు యుద్ధకళగా ప్రాచుర్యం పొందిన కళరిపయట్టులో శిక్షణ తీసుకున్నా. నాకు తెలిసిన ప్రపంచం సినిమా మాత్రమే. బతికున్నంత వరకు ఇందులోనే ఉంటా.

Rsihab.jpg
పర్సనల్‌ ఛాయిస్‌

డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా చాలా క్రేజీగా ఆలోచిస్తారు. మరెవ్వరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తాయి. ఆయన సినిమాలో నటించాలనుంది.

నాకు ఒక విచిత్రమైన మూఢనమ్మకం ఉంది. బయటకి వెళ్లేముందు జేబులో కచ్చితంగా ఒక కాయిన్‌ పెట్టుకుంటా.


నాలో ఎవరికీ తెలియని కొన్ని క్రేజీ టాలెంట్స్‌ ఉన్నాయి. ఎవరి గొంతునైనా మిమిక్రీ చేస్తా. అలాగే నా ముక్కుపైన పెన్సిల్‌ను సునాయాసంగా నిలబెడతా.


నాకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటే మా నాన్నే. ఆయనే నా హీరో. ఆయన వల్లే క్రమశిక్షణ, కష్టపడేతత్వం నేర్చుకున్నా.


నాకు ఇష్టమైన నటుడు ఉపేంద్ర. ఆయన ఓ లెజెండ్‌. ఆయనతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇష్టం.



ఫటాఫట్‌

నటుడు కాకపోయుంటే: టీచర్‌ అయ్యేవాడ్ని. నాకు జ్ఞానాన్ని
పంచడం ఇష్టం.
ఫస్ట్‌ క్రష్‌: స్కూల్‌లోనే. ఆమె పేరు నాకింకా గుర్తుంది.
సూపర్‌ పవర్స్‌ వస్తే: టైమ్‌ ట్రావెల్‌ చేసి చరిత్రను అన్వేషించేవాడిని.
వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠం: ప్రతిభ కన్నా ఓర్పు, పట్టుదల ముఖ్యం.
కచ్చితంగా వెంట ఉండాల్సింది: నా ఫోన్‌. అది నా లైఫ్‌లైన్‌.
ఇష్టమైన పుస్తకం: ఆర్కే నారాయణ్‌ రాసింది ఏదైనా.
ఇష్టమైన ప్రదేశం: బెంగళూరు. నా కాలేజీ రోజులు అక్కడే గడిచాయి.
ఇష్టమైన అభిరుచి: స్కెచింగ్‌, క్రికెట్‌
కంఫర్ట్‌ ఫుడ్‌: బిసిబెలెబాత్‌
rishab.jpgఇష్టమైన దర్శకుడు: యోగరాజ్‌ భట్‌

Updated Date - Oct 05 , 2025 | 09:22 AM