Dude: భూమ్ భూమ్ వీడియో సాంగ్! మమితా బైజు.. హీరోను డామినేట్ చేసి పడేసిందిగా
ABN , Publish Date - Aug 28 , 2025 | 08:58 PM
వరుస విజయాలతో తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న నటుడు ప్రదీప్ రంగనాథన్.
వరుస విజయాలతో తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా కీర్తిశ్వరన్ (Keerthiswaran) దర్శకత్వంలో తెలుగు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) నిర్మిస్తోన్న చిత్రం ‘డ్యూడ్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మమితాబైజు (Mamitha Baiju) కథానాయికగా నటించగా శరత్ కుమార్ (Sarath Kumar) కీలక పాత్రలో కనిపించనున్నాడు.సాయి అభయంకర్ (Sai Abhyankkar) సంగీతం అందిస్తున్నాడు.ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి భూమ్ భూమ్ (Boom Boom) అంటూ సాగే ఓ హుషారైన పాటను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. శనపతి బరద్వాజ్ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu) ఈ గీతానికి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వీయ సంగీతంలో ఆలపించాడు. ఇక ఈ పాట విషయానికి వస్తే.. పాటను ప్రదీప్ రంగనాధన్, మమితా బైజు ముప్పై, నలభై మంది యూత్ కళాకారులపై చిత్రీకరించారు.
కాలేజీ సమయంలో యువతీ, యువకుల మనస్తత్వాలను వివరించేలా పాట ఉంది. ఇక ముఖ్యంగా పాటలో హీరో కన్నా మమితా బైజునే సెంటరాఫ్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ప్రదీప్‌ను బాగా డామినేట్ చేసింది. మమితా తన గత చిత్రాల మాదిరిగానే ఫుల్ ఎనర్జీతో ప్రతీ సీన్‌లో మెస్మరైజ్ చేసింది. డాన్స్‌లో కూడా ఫుల్ జోష్‌లో స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాట చూశాక నటనలోనే కాదు డ్యాన్సులోనూ మమితా సూపర్ అనక మానరు.