Bigg Boss: బిగ్‌బాస్ ఓపెన్ .. తిరిగొచ్చిన కంటెస్టెంట్లు! షో యథాతథం
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:35 AM
అనుమతులు లేకుండా బిగ్‌బాస్ నడిపిస్తున్నారంటూ అధికారులు కంటెస్టెంట్లను బయటకుతీసుకు వచ్చి తాళం వేసిన సంగతి తెలిసిందే.
అనుమతులు లేకుండా బిగ్‌బాస్ నడిపిస్తున్నారంటూ కన్నడనాట అధికారులు ఆ షో నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్లి కంటెస్టెంట్లను బయటకుతీసుఉవచ్చి తాళం వేసిన సంగతి జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సమస్య ఓ కోలిక్కి రావడంతో కన్నడ బిగ్‌బాస్ 12వ (Bigg Boss Kannada) సీజన్ యథాతథంగా కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) బుధ వారం రాత్రి చర్చలు జరపడంతో సమస్య పరిష్కారమైంది.
డీసీఎం ఆదేశాలతో రామనగర్ జిల్లా అధికారి యశ్వంత్ గురుకర్, ఎస్సీ శ్రీనివాస గౌడ, తహసీల్దారు తేజశ్విని తదితరులు జాలీవుడ్ స్టుడియోకు వేసిన తాళాలను గురవారం తెల్ల వారుజామున 2.45 గంటలకు తెరిచారు. ఆ వెంటనే ఈగల్టన్ రిసార్టులో ఉన్న 17మంది కంటెస్టెంట్లను నిర్వాహకులు బిగ్బాస్ హౌస్‌కు తీసుకువచ్చారు. ఆ వెంటనే బిగ్ బాస్ ప్రోమోను గురువారం విడుదల చేశారు.
కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు శాఖల అనుమతులు తీసుకోని కారణంగా బిగన్ హౌస్‌ను మంగళవారం సీజ్ చేశారు. వివాదానికి తెరపడటంతో షో యథాతథంగా కొనసాగే వెసులుబాటు లభించింది. డీసీఎం ఆదేశాల మేరకు జాలీవుడ్ స్టుడియోను తెరిచామని, బిగ్ బాస్‌పై ఆంక్షలు లేవని జిల్లా అదికార్ యశ్వంత్ గురుకర్ మీడియాకు చెప్పారు.
ఈ సందర్భంగా డీసీఎం డీకే శివకుమార్‌కు.. కిచ్చా సుదీప్ 'ఎక్స్' ద్వారా దన్యవాదాలు తెలపగా, డీసీఎం కూడా రీ ట్వీట్ చేశారు. కాగా, బిగ్‌బాస్ హౌస్ ముందు కన్నడ సంఘాల కార్యకర్తలు గురువారం ఆందోళన చేశారు. వెంటనే బిగ్బాస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్యకర్తలు గేట్ల పైకి ఎక్కి నిరసన తెలిపే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపు లోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.