Lavanya: మెగా కోడలు.. కొత్త తమిళ మూవీ! పెళ్లికి ముందు చేస్తే.. ఇప్పుడు బయటకు వచ్చింది
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:52 PM
మెగా కోడలు, వరుణ్ తేజ్,శ్రీమతి లావణ్య పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ రేర్‌గా సినిమాలు చేస్తున్నారు.
మెగా కోడలు, వరుణ్ తేజ్ (Varun Tej) శ్రీమతి లావణ్య (Lavanya) పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ రేర్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ కోవలో గత సంవత్సరం తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేయగా తాజాగా సతీ లీలావతి అనే ఓ సినిమా చేసింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లకు రానుంది. అయితే ఇది ఓ వైపు ఇలా ఉండగానే తను పెళ్లికి ముందు నటించిన ఓ తమిళ చిత్రం తనాల్ (Thanal) అనేక అవాంతారాలను దాటుకుని ఎట్టకేలకు థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయింది.
ఈమధ్య డీఎన్ఏ అనే చిత్రంతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆధర్వ (Atharvaa) ఈ చిత్రం హీరో. రవీంద్ర మాదవ ( Ravindra Madhava) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఔట్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ తరహా జానర్‌లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 12న థియేటర్లకు వస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌ను బట్టి చూస్తే .. పోలీసుకు, ఓ భారీ గ్యాంగ్‌కు మధ్య జరిగే సినిమా అని తెలుస్తోండగా ఓ కేసు విషయంలో పోలీసుల బెటాలియన్ ఓ ప్రాంతానికి వెళ్లడం, అప్పటికే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకున్న రౌడీ గ్యాంగ్ పోలీసులపై దొమ్మికి దిగి కనిపించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళతారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అవగలిగారు, రౌడీ మూకల ఆట ఎలా కట్టించారనే ఆసక్తికరమైన కథ కథనాలతో సినిమాను తెరకెక్కించారు.
అయితే లావణ్య, వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకోక ముందు నటించిన ఈ చిత్రం కాస్త ఆలస్యమవుతూ వచ్చి ఇప్పుడుపెళ్లై రెండేండ్లు గడిచి రేపో మాపో బేబీ వచ్చే సమయంలో రిలీజ్ అవుతుండడంతో ఇప్పుడు ఈ అంశం వార్తల్లో నిలిచింది. మరో విషయమేమిటంటే. లావణ్య హస్బెండ్ అదేనండి వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేశ్ చిత్రంలో ఆధర్వ కీ రోల్ చేశాడు.