Bala: రామ్ వంటి.. దర్శకుడు అవసరం

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:46 AM

రామ్ వంటి ఒక దర్శకుడు. తమిళ చిత్రపరిశ్రమకు అవసరమని ప్రముఖ దర్శకుడు బాలా అన్నారు.

porandhu

రామ్ (Director Ram) వంటి ఒక దర్శకుడు. తమిళ చిత్రపరిశ్రమకు అవసరమని ప్రముఖ దర్శకుడు బాలా అన్నారు. జియో హాట్ స్టార్, జీజేఎస్ ప్రొడక్షన్స్ సెవ‌న్ సీస్ అండ్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రామ్ దర్శకత్వంలో రూపొందిన పీల్ గుడ్ మూవీ ప‌రందు పో (Paranthu Po). వచ్చే నెల 4న థియేట‌ర్ల‌లోవిడుదల కానుంది. శివ,క్రేజ్ ఆంటోని, మాస్టర్ మిథన్ రియాన్, అంజలి, అజు వర్గీష్‌, విజయ్ యేసుదాస్ తదితరులు నటించారు.

తాజాగా.. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో జ‌రుగ‌గా త‌మిళ చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 30 మంది దర్శకులు పాల్గొని ఆడియో రిలీజ్ చేసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుల్లో కస్తూరిరాజా, విక్రమన్, బాలాజీ శక్తివేల్, శ‌శి, వెట్రీ మారన్, బాలా, విజయ్, వెట్రిమారన్ నిర్మాత‌లు ధ‌నుంజ‌య్‌, సురేశ్ కామాక్షి, సీనియ‌ర్ కెమెరామెన్ పీసీ శ్రీరామ్, హీరో సిద్దార్డ్ తదితరులు పాల్గొన్నారు.

GjKtXVvWYAAui9w.jpeg

ఈ సంద‌ర్భంగా బాలా మాట్లాడుతూ.. మీకు పాదాభి వందనం చేసి అడుగుతున్నాఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకెళ్లి విజ‌య‌వంతం చేయాల‌ని అన్నాడు.హీరో శివ మాట్లాడుతూ.. దర్శకుడు రామ్ మనందరికీ ల‌భించిన మ‌ట్టిలో మాణిక్యం అని అన్నారు.. నా కోసం ఇక్కడకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చిత్రాన్ని విజయవంతం చేయాలన్నారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. కొన్ని చిత్రాల్లోని పాత్రలు మన మనసుకు హత్తుకునేలా ఉంటాయి నాకు అలాంటి చిత్రమే పరందు పో రామ్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమా వస్తే ఎలా ఉంటుందో అదే ఈ చిత్రం అని అన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:46 AM