Tunnel: అథర్వ మురళి క్రైమ్.. సస్పెన్స్.. థ్రిల్లర్   

ABN , Publish Date - Sep 18 , 2025 | 09:43 AM

అథర్వ (Atharvaa Murali), మురళీ నటించిన ‘టన్నెల్’(Tunnel) సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌తో  ఇప్పుడు  తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

అథర్వ (Atharvaa Murali), మురళీ నటించిన ‘టన్నెల్’(Tunnel) సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌తో  ఇప్పుడు  తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రవీంద్ర మాధవ (Ravindra Madhav) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి (lavanya tripati) కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ. రాజు నాయక్  సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘టన్నెల్’ తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ట్రైలర్ చాలా గ్రిప్పింగ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు,  ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉందని, మంచి మెసెజ్‌ను కూడా ఇచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు.  ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు అందరూ వావ్ అనాల్సిందే. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేశారు, 

Updated Date - Sep 18 , 2025 | 01:54 PM