45 Movier: 63 ఏళ్ల వయస్సులో శివన్న లేడీ గెటప్.. ఆ గట్స్ కి హ్యాట్సాఫ్
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:25 PM
తాజాగా కన్నడలో ఒక ప్రయోగాత్మకమైన సినిమా వస్తుంది. అదే 45. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ( Arjun Janya) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం.
45 Movier: ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా యాక్షన్ సినిమాలు లేకపోతే హర్రర్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. చాలా తక్కువమంది మాత్రమే ప్రయోగాల జోలికి వెళ్తున్నారు. కథలో మంచి పట్టు ఉంటే ప్రయోగాలను కూడా ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా ఎన్నో సినిమాలు హిట్ కూడా అయ్యాయి. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కథలో బలం లేకపోయేసరికి పత్తాలేకుండా పోయాయి. తాజాగా కన్నడలో ఒక ప్రయోగాత్మకమైన సినిమా వస్తుంది. అదే 45. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ( Arjun Janya) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం.
ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), ఉపేంద్ర (Upendra), రాజ్ బీ శెట్టి (Raj B. Shetty) హీరోలుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవరి 1 న 45 సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ని బట్టి ఇదొక ప్రయోగంలా కనిపిస్తుంది. ఉపేంద్ర యముడిగా.. శివన్న మరో దేవుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా కథ ఏంటి అనేది ట్రైలర్ లో చూపించలేదు కానీ, పాత్రలు, సంభాషణలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ట్రైలర్ మొత్తం ఒక ఎత్హు అయితే.. చివర్లో శివన్న లేడీ గెటప్ లో కనిపించడం మరో ఎత్తు. సాధారణంగా కథ డిమాండ్చేస్తే కుర్ర హీరోలు లేడీ గెటప్స్ వేయడం చూసాం. కానీ, మొదటిసారి ఒక స్టార్ హీరో అది కూడా 63 ఏళ్ల వయస్సులో ఇలా లేడీ గెటప్ లో.. అది కూడా భరతనాట్య కళాకారిణి గెటప్ లో కనిపించడం అనేది విశేషమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కథ బావుండి.. దానికి తగ్గట్లు ఈ గెటప్ ఉంటే ఓకే.. కానీ, ఏదైనా తేడా కొడితే మాత్రం ట్రోల్స్ తప్పవు అని కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వయస్సులో ఆయన ఇలాంటి ప్రయోగం చేయడానికి గట్స్ ఉండాలి అని, శివన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.