Sarpatta Parambarai: ఆర్య మూవీకి సీక్వెల్
ABN , Publish Date - May 13 , 2025 | 03:55 PM
ఆర్య ప్రధాన పాత్రధారిగా పా. రంజిత్ తెరకెక్కించిన 'సార్పట్ట పరంపర' చిత్రం అప్పట్లో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను చేయబోతున్నారు.
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆర్య (Arya) నటించిన 'సార్పట్ట పరంపర' (Sarpatta Parambarai) చిత్రం కరోనా టైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో పా. రంజిత్ (Pa. Ranjith) ఈ పీరియాడిక్ మూవీని తెరకెక్కించాడు. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతంలో జరిగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో అప్పటి రాజకీయ సమీకరణాలను సైతం పా. రంజిత్ చూపించాడు. అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడది కార్యరూపం దాల్చబోతోంది.
ఈ యేడాది ఆగస్ట్ నుండి 'సార్పట్ట' సీక్వెల్ మొదలవుతుందని, దానికి 'సార్పట్ట : రౌండ్ 2' అనే పేరు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పా. రంజిత్ 'వేట్టువామ్' మూవీ చేస్తున్నాడు. ఆ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఆర్య, దినేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాన్ని షూటింగ్ పూర్తి కాగానే 'సార్పట్ట' సీక్వెల్ ను సెట్స్ పైకి ఎక్కిస్తాడని అంటున్నారు. మొదటి సినిమా ఓటీటీలో వచ్చినా... ఇప్పుడీ సీక్వెల్ ను థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేస్తారని, తమిళంతో పాటు తెలుగులోనూ ఇది రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.