Killer: హీరోగా, దర్శకుడిగా ఎస్‌జె సూర్య.. ఏఆర్ రెహమాన్ సంగీతం 

ABN , Publish Date - Jul 07 , 2025 | 06:27 PM

దర్శకత్వానికి పది సంవత్సరాలు దూరంగా ఉన్న SJ సూర్య కిల్లర్ (killer) సినిమాతో తిరిగి కెప్టన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. 

KIller Movie

దర్శకత్వానికి పది సంవత్సరాలు దూరంగా ఉన్న SJ సూర్య కిల్లర్ (killer) సినిమాతో తిరిగి కెప్టన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు.  ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య (Sj Suriya) హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ నిర్మాతలు.

ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రాజెక్ట్ రావడం చూస్తేనే సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది. ఇది ఎస్.జె. సూర్యా – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో సినిమా. ఇంతకు ముందు నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి సినిమాలకు కలిసి పనిచేశారు. 'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇండియా అంతటా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మిగతా క్యాస్ట్, టెక్నికల్ టీమ్ వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు. 

Updated Date - Jul 07 , 2025 | 06:27 PM