A.r murugadoss dance: మురుగుదాస్ మాస్ డాన్స్
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:52 PM
ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటుంటారు... అలాగే పిల్లల ముందు కొందరు పేరెంట్స్ చిన్నపిల్లలలా మారిపోతుంటారు. అలోవర్ ఇండియా తన సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మురుగదాస్ సరిగా అలాంటి పనే చేశాడు. చిన్నపిల్లాడిలా మారి ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది
కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా వెలిగిన డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ (AR Murugadoss) . గజిని, సర్కార్, స్టాలిన్, సెవెంత్ సెన్స్, దర్బార్ వంటి సినిమాలతో సత్తా చాటిన ఈ దర్శకుడు ఇటీవల కాలంలో కాస్త వెనుకబడ్డాడు, సల్మాన్ ఖాన్‌తో ఆయన తీసిన సికందర్ (Sikanda) బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసింది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా మదరాశి (Madarashi) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మురగదాస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం ఆయన కూతురి పెళ్లి ఫంక్షన్ కావటం విశేషం.
చెన్నైలో మురుగదాస్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా ఆయన కుమార్తె దివ్య పెళ్లివేడుక జరిగింది. అందులో భాగంగా హల్దీ సెలబ్రేషన్ నిర్వహించారు. ఆ సందర్భంలో అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియలో భార్య, కూతురు, కొడుకుతో కలిసి రెట్రో మూవీలోని పాటకు మురుగదాస్ డ్యాన్స్ చేసి స్టేజ్‌ని ఊపేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది. మురుగదాస్ డైరెక్టర్‌గానే కాదు, డ్యాన్సర్‌గా కూడా రాక్ చేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ సీరియస్ డైరెక్టర్‌గా కనిపించే మురుగదాస్… ఈసారి తండ్రిగా తన సంతోషాన్ని, ఆనందాన్ని డ్యాన్స్ రూపంలో ప్రదర్శించడం పలువురుని ఆకట్టుకుంది.
ఈ వీడియో చూసిన వీక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీన్లు గనుక సినిమాలో ఉంటే మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. 2005లో వివాహం చేసుకున్న మురుగదాస్, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కెమెరాలకు దూరంగా ఉంచాడు. సినిమాలు, స్క్రిప్ట్‌లు, కథల్లోనే తన ప్రపంచాన్ని చూసుకునే ఆయన, ఈసారి తన కూతురి జీవితంలో ముఖ్యమైన పెళ్లి వేడుకను ఆనందంగా సెలబ్రేట్ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక తండ్రిగా మురుగదాస్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడని మెచ్చుకుంటున్నారు.