Andrea Jeremiah: సినిమా నిర్మాణం కోసం మరీ ఇంత చేయాలా ఆండ్రియా
ABN , Publish Date - Nov 22 , 2025 | 09:07 AM
హీరోయిన్ ఆండ్రియా (Andrea Jeremiah) పెద్ద సాహసం చేశారు. తన ఇంటిపై రుణం తీసుకుని సినిమా నిర్మించారు. ‘
హీరోయిన్ ఆండ్రియా (Andrea Jeremiah) పెద్ద సాహసం చేశారు. తన ఇంటిపై రుణం తీసుకుని సినిమా నిర్మించారు. ‘మాస్క్’ (Mask movie) పేరుతో రూపొందించిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు 35కుపైగా చిత్రాల్లో నటించాను. ‘మాస్క్’ కథ స్టోరీ నచ్చడంతో నేను, నిర్మాత చొక్కలింగం కలిసి నిర్మించాం. సినీ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కాదు. కానీ, మా ప్రాజెక్టుకు ఆయన ఒక మెంటర్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఎన్నో సంవత్సరాలు శ్రమించి సంపాదించి ఓ ఇల్లు నిర్మించుకున్నాను.
ఇప్పుడు ఆ ఇంటిపై రుణం తీసుకుని ఈ సినిమా తీసాను. ఈ విషయం తెలిసిన అనేక మంది నన్ను పిచ్చిదానిలా చూశారు. కానీ, సినిమాల్లో వచ్చిన సంపాదనలోనే ఇల్లు నిర్మించాను. ఇపుడు నాకు నచ్చిన కథతో సినిమా తీసేందుకు ఆ ఇంటిపై రుణం తీసుకోవడంలో తప్పులేదని భావించాను. అందుకే ఆ సాహసం చేశాను. నేను నటించిన ‘మనుషి’, ‘పిశాచి-2’ చిత్రాలు విడుదలకు నోచుకోక పోవడం చాలా బాధగా ఉంది. నేను హీరోయిన్‌గా నటించిన మరో సినిమా కూడా విడుదల కాలేదు. ‘మాస్క్’ సినిమా విజయం సాధించి లాభాలు వస్తే ‘పిశాచి-2’ చిత్రాన్ని నేనే రిలీజ్ చేస్తాను. ‘మాస్క్’ మూవీలో హీరో కవిన్ నటన చాలా బాగుంది’ అని వివరించారు.