Andrea Jeremiah: పిశాచి 2 లో నగ్నంగా ఆండ్రియా.. ఆమె ఏమన్నదంటే
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:07 PM
కోలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా జెరెమియా(Andrea Jeremiah) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Andrea Jeremiah: కోలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా జెరెమియా(Andrea Jeremiah) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో అంత పెద్ద సినిమాలు చేయలేదు కానీ, సింగర్ గా తన హస్కీ వాయిస్ తో సాంగ్స్ పాడి అలరించింది. ఇక ప్రస్తుతం అమ్మడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాండ్ లో సింగర్ గా సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈ మధ్యనే ఆండ్రియా నటించిన మాస్క్ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
ఇక ఆండ్రియా నటించిన సినిమాల్లో పిశాచి 2 ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించిందని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది.
సినిమాలో నగ్న సన్నివేశాల గురించి మిస్కిన్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా తాజాగా ఆండ్రియా కూడా స్పందించింది. ' నేను డైరెక్టర్ ను నమ్ముతాను. మిస్కిన్ చాలా పరిణితి చెందిన వ్యక్తి. సినిమాలో ఎన్నో నగ్న సన్నివేశాలు ఉన్నా కూడా ఆయన వాటిని తెరకెక్కించలేదు. కొన్ని సీన్స్ అయితే షూట్ చేసి సినిమాలో తొలగించాడు. కొందరు అయితే ఆమె స్కర్ట్ లాగండి అని చెప్పారు. వారికున్న పరిణితి అలాంటింది. మిస్కిన్ చాలా మంచి వ్యక్తి. పిశాచి 2 లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. కానీ, అవి నగ్నంగా ఉండవు' అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.