Amala Paul: అమలాపాల్‌ భర్తతో ఇలా చేసింది ఏంటి ..

ABN , Publish Date - May 10 , 2025 | 03:53 PM

తాజాగా జరిగిన జేఎఫ్‌ డబ్ల్యూ మూవీ అవార్డ్‌ వేడుకలో హీరోయిన్‌ అమలాపాల్‌ (Amala Paul) ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌) అవార్డు అందుకున్నారు.


తాజాగా జరిగిన జేఎఫ్‌ డబ్ల్యూ మూవీ అవార్డ్‌ వేడుకలో హీరోయిన్‌ అమలాపాల్‌ (Amala Paul) ఉత్తమ నటిగా(క్రిటిక్స్‌) అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగత్‌ దేశాయ్‌తో (Jagath Desai) తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని తెలిపింది. ‘‘జగత్‌-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలో సెటిలయ్యారు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు చూడడు. దీంతో నేను నటి అనే విషయాన్ని చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలు ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్‌ చేశాడు. నేను అవార్డ్స్‌ తీసుకున్న వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు’ అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్‌ తదితర సినిమాలు చేసిన ఆమె తమిళంలోనూ పలు చిత్రాలు నటించి గుర్తింపు పొందారు. గతంలో అమలా డైరక్టర్‌ ఏఎల్‌ విజయ్‌ని 2014లో పెళ్లి చేసుకుంది.  పలు కారణాల మూడేళ్లకే 2017లో విడిపోయారు. కొంతగ్యాప్‌ తర్వాత 2023లో బిజినెస్‌ మ్యాన్‌ జగత్‌ దేశాయ్‌ని అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవల ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు.  

Updated Date - May 10 , 2025 | 04:08 PM