AM Ratnam: ఎస్జే సూర్య ఓకే అంటే.. ఖుషీ 2కు నేను రెడీ! వారి కుమారులతోనైనా
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:54 AM
ఖుషీ (Kushi) సినిమా రెండో భాగం నిర్మించేందుకు సిద్దమని ప్రముఖ నిర్మాత ఏఎం. రత్నం వెల్ల డించారు.
దర్శక నటుడు ఎస్ జే సూర్య (SJ Suryah) ఆంగీకరిస్తే ఖుషీ (Kushi) సినిమా రెండో భాగం నిర్మించేందుకు సిద్దమని ప్రముఖ నిర్మాత ఏఎం. రత్నం వెల్ల డించారు. తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటిం చిన 'ఖుషీ' చిత్రాన్ని ఈ నెల 25వ తేదీన శక్తిఫిలిమ్స్ అదినేత శక్తివేల్ & రిలీజ్ చేయనున్నారు. దీన్ని పురస్క రించుకుని నిర్మాత ఏఎం.రత్నం (AMRatnam), దర్శకుడు ఎస్జే సూర్య నిర్మాత శక్తివేల్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏఎం.రత్నం మాట్లాడుతూ, 'ఇపుడు దేశ వ్యాప్తంగా పార్ట్-2 ట్రెండ్ కొనసాగుతుంది. అందువల్ల నా చిత్రాలన్నీ రెండో భాగం తెరకెక్కించేందుకు సిద్ధం. ఆ చిత్రాల్లో 'ఖుషీ' స్పెషల్, ఎస్ జే సూర్య అంగీకరిస్తే ఖుషీ (Kushi) రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం. అందులో హీరోగా విజయ్ కుమారుడు నటి స్తారా? మరొకరు నటిస్తారా? అన్నది దర్శకుడి నిర్ణయం. ఆయన ఓకే చెబితే మాత్రం రెండో భాగం నిర్మించేందుకు సిద్ధం' అని పేర్కొన్నారు.
అనంతరం సూర్య మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ తీశాం. ప్రేక్షకుడిగా ఈ చిత్రంలోని పాటలను చూసి ఎంజాయ్ చేశాను కానీ, టెక్నీషియన్‌గా నచ్చదు. కెమెరామెన్ జీవా అద్భుతమైన ఛాయాగ్రహణం సమకూర్చారు. నటుడు వివేక్ నటన. వీరిద్దరు ఇపుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉంది.
ఇక తెలుగులోనూ నాకు గుర్తింపు లభించిందంటే దానికి కారణం తెలుగులో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో తీసిన ఈ'ఖుషీ' మూవీనే అందుకు ఈ సందర్భంగా నిర్మాత రత్నంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నారు. నిర్మాత శక్తివేలన్ ఒక ఫ్యాన్ బాయ్ గా ముందుకు వచ్చి రీ రిలీజ్ చేస్తున్నారు. ఖుషీ ఒక ఎవర్ గ్రీన్ మూవీ. అది దేవుడు ఇచ్చిన బహుమతి అని అన్నారు.
ఇదిలాఉంటే.. గతంలోనే డైరెక్టర్ ఎస్జే సూర్య ఖుషి2 స్క్రిప్టును పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు వినిపించాడని దానికి పవర్ స్టార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత పవన్ లవ్‌స్టోరీలకు గుడ్ బై చెప్పడంతో ఈ చిత్రం మూలకు పడినట్లు దాని స్థానంలోనే పులి వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు ప్రచారంలో ఉండడం గమనార్హం.