Ajith Kumar: ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’
ABN , Publish Date - Nov 24 , 2025 | 02:52 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు (Ajith Kumar)అరుదైన గౌరవం దక్కింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు (Ajith Kumar)అరుదైన గౌరవం దక్కింది. 2025 సంవత్సరానికి ఆయన ‘జెంటిల్మెన్ డ్రైవర్’ (Gentleman driver of The year 2025) అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్య శాలిని కూడా వెళ్లారు. పురస్కారం అనంతరం ఆమె భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘వెనిస్‌లో నా భర్త పక్కన నిలబడటం గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే... రేసింగ్ డ్రైవర్ దివంగత ఫిలిప్ చారియోల్ గౌరవార్థం ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డును ఆయన అందుకున్నారు’ అని శాలిని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జీటీ రేసింగ్‌లో అగ్రగామిగా పరిగణించబడే ఎస్‌ఆర్‌ఓ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ ఈ అవార్డును అందజేసింది. ఈ ఏడాది కార్ రేసర్ కావాలనే తన కలను నిజం చేసుకున్నారు అజిత్. నాలుగు డిమాండింగ్ ఇంటర్నేషనల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లతో పాల్గొని అనేక ప్రశంసలు గెలుచుకోవడంతో దేశానికి గర్వకారణంగా నిలిచారు అజిత్. ఆయన సొంతంగా జట్టును కలిగి ఉండటంతోనే ఆగకుండా తన జట్టులోని ఇతర సభ్యులతో కూడా రేసుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ ‘ఈ అద్భుతమైన సంవత్సరం నుంచి మనం లెక్కలేనన్ని కథలు రాయవచ్చు. కాని అది మరొక రోజు కోసం. ప్రతి ల్యాప్‌తో, ప్రతి సవాలుతో మనం మరింత బలపడటమే ముఖ్యం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని అన్నారు.