Ajith Kumar: రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదు

ABN , Publish Date - May 03 , 2025 | 11:55 AM

ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, ఈ విషయంలో నటీనటులకు ఎలాంటి ఆంక్షలు లేవని సినీ నటుడు అజిత్‌ వ్యాఖ్యానించారు.


ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, ఈ విషయంలో నటీనటులకు ఎలాంటి ఆంక్షలు లేవని సినీ నటుడు అజిత్‌ (Ajith kumar) వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆశ తనకు లేదని, అదే సమయంలో తన మిత్రుడు విజయ్‌ (Vijay) రాజకీయ ప్రవేశం చేయడం అత్యంత సాహసోపేతమైన చర్య ఆయన ప్రశంసించారు. సినీ రంగంలో ప్రవేశించి 33 యేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశించే సినీ కళాకారులకు తాను శుభాకాంక్షలు చెబుతానని, అంతేకాని తనకు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రాగలమనే నమ్మకంతో రాజకీయ ప్రవేశం చేసే వారంతా విజయం సాధించాలనే కోరుకుంటానని చెప్పారు.

Vijay.jpg

140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం విభిన్న మతాలు, విభిన్నజాతులవారు, విభిన్నభాషలకు చెందిన వారంతా సామరస్యంగా జీవిస్తున్నారని, వీరందరినీ ఏకతాటిపై నడిపించడం రాజకీయ నేతలకే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రపతి భవన్‌లో పాటించాల్సిన నియమాలు, అక్కడి భద్రతా ఏర్పాట్లు చూసి తాను ఆశ్చర్యపోయానని, నాయకులంతా తమ జీవనయానాన్ని ఎలా సాగిస్తున్నారో అప్పుడే తనకు అవగతమైందన్నారు. ఆ నాయకులను చూసి తాను అసూయపడలేదని, ఓ దేశాన్ని, లేదా ఓ రాష్ట్రాన్ని భుజాలపై మోయటం కష్టసాధ్యమని తెలుసుకున్నాననన్నారు. అందుకనే తాను నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశం చేయడం  సాహసోపేతమైన నిర్ణయమని చెబుతున్నానని పేర్కొన్నారు

Updated Date - May 03 , 2025 | 11:55 AM