Meenakshi Chaudhary: ప్రదీప్‌ రంగనాథన్‌తో.. మీనాక్షి చౌదరి! ర‌చ్చ రంబోలానే

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:16 PM

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళుతూ అగ్ర స్థానంలో కొన‌సాగుతున్న క్రేజీ హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి తమిళంలో మరో అవకాశం వరించింది.

Meenakshi Chaudhary

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళుతూ అగ్ర స్థానంలో కొన‌సాగుతున్న క్రేజీ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)కి తమిళంలో మరో అవకాశం వరించింది. హ్యాట్రిక్‌ విజయాలను తన ఖాతాలో వేసుకున్న దర్శక హీరో ప్రదీప్‌ రంగనాథన్ (Pradeep Ranganathan) కొత్త చిత్రంలో మీనాక్షికి అవకాశం వచ్చినట్టు సమాచారం.

‘లవ్‌టుడే’, ‘డ్రాగన్‌’, ‘డ్యూడ్‌’ సినిమా విజయం తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌ ‘ఎల్‌ఐకే’లో నటించారు. ఇపుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించి హీరోగా నటించనున్నారు. ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్ర ప్రీప్రొడక్షన్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

Meenakshi Chaudhary

ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆమె ఇప్పటికే ‘కొలై’, ‘సింగపూర్‌ సలూన్‌’, ‘ది గోట్‌’ చిత్రాల్లో నటించిన కోలీవుడ్‌ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:16 PM