Manya Anand: ‘అడ్జస్ట్మెంట్' అడిగారు.. ధనుష్‌పై మరో వివాదం! తప్పుగా.. ప్రచారం చేస్తున్నారన్న నటి
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:29 AM
నిత్యం ఏదో ఓ వార్తలో ప్రధానంగా నిలిచే తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) పై మరోమారు ఓ కొత్త వివాదం రేగింది.
నిత్యం ఏదో ఓ వార్తలో ప్రధానంగా నిలిచే తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) పై మరోమారు ఓ కొత్త వివాదం రేగింది. ఈసారి ప్రముఖ టీవీ నటి మాన్యా ఆనంద్ (Manya Anand) చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ ( Kollywood)లో పెద్ద కలకలం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ధనుష్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఇస్తామని చెప్పి ఆయన మేనేజర్ శ్రేయాస్ (Shreyas) తనను సంప్రదించాడని, నేను కూడా “ఒక మంచి అవకాశం వస్తుందని నిజంగా నమ్మాను. కానీ రోజులు గడిచేకొద్దీ వాళ్లు అడిగిన మాటలు, ప్రవర్తన చూసి నేను షాక్ అయ్యానని పేర్కొంది. ‘పాత్ర కోసం కొన్ని కమిట్‌మెంట్‌లు ఇవ్వాలి’ అని సూచిస్తూ, ధనుష్‌తో ‘అడ్జస్ట్మెంట్’ చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆరోపించింది. వారి అసలు ఉద్దేశం త్వరగానే తెలుసుకుని నేను జాగ్రత్త పడ్డానని కానీ పాత్ర కోసం మహిళలపై ఇలాంటి ఒత్తిడి తేవడం చాలా తప్పని మాన్యా ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ విషయం నన్ను తీవ్రంగా కలచివేసిందని వివరించింది.
ఇంకా మాన్యా మాట్లాడుతూ..ఇలాంటి ఒత్తిళ్లు, ‘అడ్జస్ట్మెంట్’ పేరుతో జరిగే అనైతిక డిమాండ్లు చిత్రపరిశ్రమలో ఇంకా కొనసాగుతున్నాయని, కొత్తగా వచ్చే నటీమణులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు భయంతో బయట పెట్టలేరని, ఈ విషయాలు బహిరంగంగా చెప్పడానికి చాలా ధైర్యం కావాలని, తనలాంటి వారు మాట్లాడితేనే మార్పు వస్తుందని ఆమె అన్నారు. అయితే.. అమె ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏ సినిమా విషయంలో చోటు చేసుకున్నది, ఇప్పుడే ఎందుకు బయట పెట్టిందనే విషయాలు మాత్రం చెప్పలేదు.
ఇదిలాఉంటే.. ఈ ఆరోపణలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో తెగ వైరల్ అవుతుంది. అయితే అయితే ధనుష్, లేదా ఆయన టీమ్, మేనేజర్ శ్రేయాస్ ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. ఈ ఆరోపణలు నిజమా? లేక అపోహలా? ధనుష్ లేదా ఆయన బృందం రెస్పాండ్ అయితే గానీ అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. కాగా తాజాగా నటి మాన్యా చేసిన ఆరోపణలు టీవీ పరిశ్రమ, సౌత్ సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కొందరు నటీమణులు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలని కోరుతున్నారు.
అయితే.. తాజాగా వైరల్గా మారిన ఈ వివాదంపై అరోపణలు చేసిన నటి మాన్యా ఆనంద్ స్పందించి ఇన్స్టాలో ఓ న్యూస్ షేర్ చేసుకుంది. తాజాగా నా ఇంటర్వ్యూ అధారంగా చాలా ఛానళ్లు ధనుష్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ప్సష్టం చేసింది. దయ చేసి ఒరిజినల్ వీడియోను చూసి ఓ నిర్ణయానికి వచ్చి మట్లాడండి అని కోరింది. మేనేజర్ శ్రేయాస్, నన్ను సంప్రదించిన వ్యక్తి తన పేరు శ్రేయాస్ అని చెప్పుకుంటూ సినిమాకి అవకాశాలు ఇస్తానని మాట్లాడిన వ్యక్తి నిజమైనవాడు కాకపోవచ్చని నేను ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నానని, ఆ నంబర్‌ను ధనుష్ సర్ టీమ్‌కు పంపించి నిజానిజాలు తెలుసుకుంటానని కూడా చెప్పానని వివరించింది. అందరూ దయచేసి తప్పుడు వార్తలు వైరల్ చేయవద్దని వేడుకుంది..ట్రోలింగ్, వైరల్ చేసే ముందు ఒరిజినల్ వీడియోను చూడండి అని కోరింది. మాన్య గతంలో తెలుగులో జెమిని టీవీలో వచ్చిన భాగ్య రేఖ అనే సీరియల్‌లోనూ నటించింది.