Dude: లేడీ లవ్.. ‘మమితా’ లుక్ వచ్చేసింది
ABN , Publish Date - May 11 , 2025 | 05:31 PM
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ . ప్రముఖ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (DUDE). ప్రముఖ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోండగా కీర్తిస్వరన్ (Keerthiswaran) దర్వకత్వం వహిస్తున్నాడు.
గత సంవత్సరం ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాను షేక్ చేసిన మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా చేస్తోండగా సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలాఉండగా ఈ సినిమాకు లెటెస్ట్ మ్యూజిక్ సెన్షేషన్ సాయి అభయంకర్ (Sai Abhyankkar) సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే శనివారం (మే 10)న ఈ మూవీ నుంచి ప్రదీప్ లుక్ రిలీజ్ చేసి టైటిల్ ప్రకటించిన మేకర్స్ ఆదివారం లేడీ లవ్‌గా మమితా లుక్‌ను సైతం రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈ దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రదీప్, మమితలు కలిసి ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది.