Andrea Jeremiah: బంగారం ధర.. చూస్తేనే భయం వేస్తోంది
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:30 PM
బంగారం సైత్ ప్రముఖ కథానాయిక, సింగర్ ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah) బంగారం ధరలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బంగారం సైత్ ప్రముఖ కథానాయిక, సింగర్ ఆండ్రియా జెర్మయ్య (Andrea Jeremiah) బంగారం ధరలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలను చూస్తుంటేనే భయం వేస్తుందని తెలిపింది.
ఇటీవల ఒక నగల దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ఇపుడు బంగారం ధరలు చూస్తుంటేనే భయం వేస్తోంది. మున్ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అన్నారు.

నేను ప్రధాన పాత్రను పోషించిన 'మాస్క్' మూవీ ఈ నెల 21వ తేదీన విడుదలవుతుంది. ఎంతో సరదాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడాలని కోరారు. హీరో విజయ్ ఒక కమాండర్ అని ఆండ్రియా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె అక్కడకు వచ్చిన అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు.