Sivakarthikeyan: బ్రేకింగ్.. హీరో శివ కార్తికేయన్ కారుకు ప్రమాదం
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:09 PM
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) కారు ప్రమాదానికి గురైంది. సెంట్రల్ కైలాష్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఎరుపు రంగు కారు ప్రమాదానికి గురైంది.
Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) కారు ప్రమాదానికి గురైంది. సెంట్రల్ కైలాష్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఎరుపు రంగు కారు ప్రమాదానికి గురైంది. హీరో కారు డ్రైవర్ కొద్దిగా స్పీడుగా పోనివ్వడంతో ఎదురుగా ఉన్న మరొక కారును ఢీకొంది. దీంతో ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తరువాత శివ కార్తికేయన్ కారును పోలీసులు తిరిగి పంపించేసినట్లు టాక్. ఇక హీరోకి గాయాలు ఏమి కాలేదు అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రెమో సినిమాతో తెలుగువారికి దగ్గరైన శివకార్తికేయన్ డాక్టర్, డాన్, ప్రిన్స్, అమరన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యనే మదరాశి అంటూ వచ్చి డిజాస్టర్ అందుకున్న శివకార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.