Jayam Ravi: సింగ‌ర్‌తో.. అడ్డంగా బుక్ అయిన స్టార్ హీరో! ఇటీవ‌లే భార్య‌తో విడాకులు

ABN , Publish Date - May 09 , 2025 | 03:11 PM

తమిళ హీరో జ‌యం రవి గ‌త సంవ‌త్స‌రం తన భార్యతో విడిపోయిన సంగ‌తి అంద‌రికి తెల‌సిందే. ఆ స‌మ‌యంలోనే ర‌వి ఓ ప్రముఖ సింగర్ తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు బాగా ప్ర‌చారం అయ్యాయి.

jayam ravi

తమిళ హీరో జ‌యం రవి (Jayam Ravi) గ‌త సంవ‌త్స‌రం తన భార్యతో విడిపోయిన సంగ‌తి అంద‌రికి తెల‌సిందే. అయితే ఆ స‌మ‌యంలోనే ర‌వి ఓ ప్రముఖ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis) తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు బాగా ప్ర‌చారం అయ్యాయి. దానికి ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అడ్డంగా దొరికిపోయారు. ఇంత‌వ‌ర‌కు తాము వృత్తి పరంగానే కలిశామని, అనవసరంగా నా విడాకుల విష‌యంలో మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకులకు సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలో రవి మోహన్ తెలిపాడు.

Gqe44PnbcAUNTuV.jpeg

ఇటీవ‌ల నిర్మాత‌గా వ‌రుస సినిమాల‌తో ద‌సుకెళుతున్న త‌మిళ నిర్మాత ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు జ‌యం రవి(Jayam Ravi)తో పాటు గాయ‌ని కెనిషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis) కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో మా మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు క‌లిసి కనిపించడంతో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి.

WhatsApp Image 2025-05-09 at 1.39.14 PM.jpeg

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే జ‌యం రవి (Jayam Ravi) తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విష‌య‌మై అప్ప‌ట్లో ర‌వి భార్య ఆర్తి (Aarti) బ‌హిరంగంగానే మాట్లాడారు. నాతో మాట్లాడ‌కుండా, నాకు చెప్పకుండానే ర‌వి మేం విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనంత‌టికి కార‌ణం ఫ‌లానా సింగ‌రే కార‌ణం అంటూ మండి ప‌డింది కూడా.

F-01XeVXEAAamNS.jpeg

త‌ర్వాత ఆ సింగ‌ర్ ఈ విష‌య‌మై స్పందించి నాకు ర‌వికి సంబంధం ఉందంటూ ఆర్తి చెప్పిన మాట‌ల‌న్నీ అవాస్త‌వాలే అంటూ మీడియాకు తెలిపింది. తీరా ఇప్పుడు జంట‌గా క‌లిసి క‌నిపించ‌డంతో నాటి రూమ‌ర్స్ అన్ని నిజ‌మే అనేలా ఇప్పుడు క‌నిపిస్తుండ‌డంతో ఈ వ్య‌వ‌హారం ఎన్ని రోజులు సాగుతుందో అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - May 09 , 2025 | 03:12 PM