Raghava Lawrence: దివ్యాంగ డ్యాన్సర్లపై.. లారెన్స్ కనకాభిషేకం
ABN , Publish Date - Sep 15 , 2025 | 09:59 AM
ప్రతిభను ప్రోత్సహించడంలోనూ, సామాజిక సేవ చేయడంలో ముందుండే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత, హీరో రాఘవ లారెన్స్
ప్రతిభను ప్రోత్సహించ డంలోనూ, సామాజిక సేవ చేయడంలో ముందుండే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత, హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తాజాగా దివ్యాంగ యువ డ్యాన్సర్లపై కరెన్సీ వర్షం కురిపిం చారు. నృత్యంపట్ల దివ్యాంగులకు ఉన్న అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించాలనే లక్ష్యంతో వారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహిం చారు. దీనికి సంబంధించిన విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు.
ఇందులో 'నా బాల్యంలో ఆలయ వేడుకలకు వెళ్ళి డ్యాన్సులు వేసే వాడిని. ఆ సమయంలో ప్రేక్షకులు నా చొక్కాకు రూపాయి నోటు కుట్టేవారు. పూల దండలు వేసే వారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. అలాంటి అను భూతిని నా బాయ్స్ కు కూడా ఇవ్వాలన్న ఉద్దే శ్యంతో వారిపై కరెన్సీ వర్షం కురిపించాను. ఇది కేవలం ప్రశంస కాదు.. ప్రోత్సాహం కూడా.
అంతేకా కుండా, మీ ఇళ్ళలో జరిగే వేడుకలను వారిని ఆహ్వా నించి ప్రదర్శనకు అవకాశం కల్పించండి. వారి నృత్యం చూస్తే మీరు ఆనందించడమే కాదు వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంతో పాటు సంతోషాన్ని కలిగిస్తుంది' అని రాఘవ లారెన్స్ (Raghava Lawrence) పేర్కొన్నారు.