Ajith Kumar: అజిత్ గ్యారేజ్ లోకి మరో రేస్ కారు.. ధరెంతో తెలుసా.. ?
ABN , Publish Date - Jun 05 , 2025 | 08:15 PM
తాజాగా అజిత్ గ్యారేజ్ లోకి మరో కొత్త రేస్ కారు చేరింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెక్లారెన్ సెన్నా(McLaren Senna) కారును అజిత్ కొనుగోలు చేశాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ఒక రేసర్ అని అందరికీ తెల్సిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అజిత్ రేసింగ్ ను ఆపడు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తీసుకొని మరీ కొన్నిరోజులు బైక్ తీసుకొని ఒంటారిగా ప్రపంచం మొత్తం తిరిగి వస్తాడు. ఇక ఈ మధ్యనే దుబాయ్ 24H రేసులో పాల్గొని 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇక అజిత్ గ్యారేజ్ లో విలువైన రేస్ కార్లు, స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. తాజాగా అజిత్ గ్యారేజ్ లోకి మరో కొత్త రేస్ కారు చేరింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెక్లారెన్ సెన్నా(McLaren Senna) కారును అజిత్ కొనుగోలు చేశాడు. ప్రపంచంలోనే ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లు కేవలం 500 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి అజిత్ గ్యారేజ్ లో చేరింది. దీని విలువ అక్షరాల రూ. 24 కోట్లు అని తెలుస్తోంది.
స్పెషల్ గా రేసింగ్ కోసమే ఈ కారు తయారుచేయబడింది. లెజెండరీ ఫార్ములా 1 డ్రైవర్ అయెర్టన్ సెన్నా(Ayrton Senna) పేరు మీద తయారుచేస్తున్న కారే మెక్లారెన్ సెన్నా. మొదటి నుంచి అజిత్..అయెర్టన్ సెన్నాకు పెద్ద అభిమాని అని అందరికి తెల్సిందే. ఆయన మీద అభిమానంతో ఈ కారును అజిత్ కొనుగోలు చేశాడు. ఇక ఆయన ఫోటో దగ్గరే కారుతో అజిత్ ఫోటో దిగి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక అజిత్ కెరీర్ విషయానికొస్తే ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగువారిని మెప్పించలేకపోయింది. ప్రస్తుతం అజిత్ AK46 సినిమాతో బిజీగా ఉన్నాడు.