Abbas: సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అబ్బాస్..

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:52 PM

ఆ హీరో ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు! అఫ్ కోర్స్ అబ్బాయిలకు అతని యాక్టింగ్ అంటే ఇష్టమే. అతని హెయిర్ స్టైల్ కు అయితే పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు. ఏమైందో తెలియదు!? సడెన్ గా బిగ్ స్క్రీన్ నుంచి ఫేడవుట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నట్టుగా సంకేతాలు పంపుతున్నాడు.

అబ్బాస్ (Abbas).. నైంటీస్ లో లవర్ బాయ్ గా.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్‌ డమ్ ను ఎంజాయ్ చేసిన హీరో. ముఖ్యంగా 'ప్రేమదేశం' (Prema Desam) సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా అప్పటి యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా నిలిచాడు. చాలా మంది అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకుని సంబరపడిపోయేవారు. అలాంటి అబ్బాస్ 2015లో మలయాళ చిత్రం 'పచ్చక్కల్లం' (Pachakkallam) తర్వాత మళ్లీ కనిపించలేదు. దాదాపు ఒక దశాబ్దం పాటు నటనకు దూరంగా ఉన్న అబ్బాస్, ఇప్పుడు సైలెంట్‌గా కం‌బ్యాక్ మోడ్‌లోకి వచ్చేశాడు. తాజాగా ఓ సూపర్ అప్డేట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.


50 ఏళ్ల వయసులో అబ్బాస్ తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ని షాక్ కు గురిచేశాడు. వెయిట్ తగ్గి, స్లిమ్ అయ్యి, సాల్ట్ అండ్ పెప్పర్ బీర్డ్ స్టైల్‌తో సూపర్ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ - వైట్ చెక్డ్ షర్ట్, వైట్ ప్యాంట్స్‌లో దిగిన అబ్బాస్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ సినిమా కోసమా... లేక సరదాగానే తీసుకున్నాడా అన్నది తెలియలేదు కానీ... అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.

లవ్ స్టోరీ మూవీకు కేరాఫ్ గా మారిన అబ్బాస్... ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్ గా మారడు. అయినా అవకాశాలు రాకపోవడంతో నిదానంగా నటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం న్యూజిలాండ్ లో గడిపాడు. అక్కడే జాబ్ చేసుకోవడంతో పాటు బరువు పెరిగిన ఫోటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. చాలా ఏళ్ల తర్వాత కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపించి మాయ చేశాడు. ఈ న్యూ లుక్ పవర్‌ఫుల్ విలన్ రోల్స్‌కి లేదా మెయిన్ క్యారెక్టర్స్ కు సూట్ అవుతుందని అబ్బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మళ్లీ స్క్రీన్‌పై స్టార్ హీరోలతో కలిసి అబ్బాస్ సందడి చేస్తాడేమో చూడాలి. లీడ్ రోల్ అయినా, టాప్ హీరోలతో బిగ్ కం‌బ్యాక్ అయినా, అబ్బాస్ రీ-ఎంట్రీ కోసం అందరూ ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 05:03 PM