Aarti Ravi: ఆధారాలతోనే మాట్లాడుతున్నా.. ఆర్తి రవి మరో పోస్ట్‌

ABN , Publish Date - May 20 , 2025 | 05:46 PM

కోలీవుడ్‌ నటుడు జయం రవి (Jayam Ravi), ఆయన సతీమణి ఆర్తి (Aarti Ravi) విడాకుల వార్తలు కొద్ది రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్‌ నటుడు జయం రవి (Jayam Ravi), ఆయన సతీమణి ఆర్తి (Aarti Ravi) విడాకుల వార్తలు కొద్ది రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకరిపై మరొకరు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే! ఆర్తి తాజాగా మరో పోస్టు పెట్టారు. "మేము విడిపోవడానికి కారణం మనీ, పవర్‌లాంటివి కాదు. మూడో వ్యక్తే కారణం. అయితే ఈ విషయాన్ని ఊహించి చెప్పడం లేదు. నా వద్ద ఆధారాలున్నాయి’’ అని అన్నారు. గాయని కెనీషాతో జయం రవి రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో రూమర్స్‌ వచ్చాయి.

ఇద్దరూ కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరకావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. సంబంధిత ఫొటోలు బయటకు రాగా.. ఆర్తి మొదటిసారి స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. అయితే, తనను సంప్రదించకుండానే ఆయన విడాకుల విషయం ప్రకటించారని ఆర్తి కామెంట్‌ చేశారు.  వీరిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  అయితే ఆర్తి పెట్టిన పోస్ట్‌కు సన్నిహితులు, నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తున్నారు.

Updated Date - May 20 , 2025 | 05:46 PM