బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఇటీవల సౌదీలో జరిగిన 'జాయ్ ఫోరమ్'లో పాకిస్తాన్, బలూచిస్తాన్‌ను సల్మాన్ వేర్వేరుగా ప్రస్తావించారు. దీంతో ఆగ్రహించిన పాక్, ఉగ్రవాదిగా ముద్రవేస్తూ యాంటీ టెర్రరిజం యాక్ట్‌లోని 4వ షెడ్యూల్లో (టెర్రర్ లింక్స్ బ్లాక్ లిస్ట్) ఆయన పేరు చేర్చినట్లు సమాచారం.