హైదరాబాద్ వేదికగా ప్రతి ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్లో తన సోదరిని సర్ప్రైజ్ చేస్తూ నటుడు మనోజ్ ఆయన సతీమణి మౌనిక పాల్గొన్నారు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.