బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న విడుదల కావాల్సిన 'సైక్ సిద్ధార్థ్' మూవీని వాయిదా వేశారు. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీనందు, యామినీ భాస్కర్ జంటగా నటించారు. బాలయ్యకు తమ మద్దతు ఉంటుందంటూ 'సైక్ సిద్ధార్థ్'ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.