ఐస్‌క్రీమ్ అమ్మే వ్యక్తి దానిని ఇవ్వకుండా కీర్తి సురేశ్‌ను చాలాసేపు ఆటపట్టించాడు. ఆ తర్వాత యథావిధిగా ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత కీర్తి వంతు వచ్చింది. తీసుకున్న ఐస్‌క్రీమ్‌కు డబ్బులు ఇవ్వబోతూ వాళ్ల టెక్నిక్‌నే వాళ్లపై ప్రయోగించింది. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అటూ ఇటూ తిప్పుతూ వాళ్లను ఆటపట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.