ప్రభాస్ వర్షం సినిమా రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ గొడవ పడ్డారు. విజయవాడలోని జయరాం థియేటర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ విషయంలో ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదం జరగ్గా అది కాస్త పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు.