ప్రేమ కథా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందు కోసం చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.