తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి కూర్చున్న ఆయన కాసేపు బన్నీని ఆటపట్టించారు. కుర్చీ మడతపెట్టి పాట వస్తున్న సమయంలో పదా రెండు స్టెప్పులేద్దాం అన్నట్లు బన్నీని బాలయ్య పిలిచారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను రాలేను అంటూ నవ్వుతూ వారించారు.