మలయాళ నటుడు వినాయకన్ మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఆయన తన ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి పొరుగింటివారితో గొడవ పడ్డారు. వారిపై అరుస్తూ, బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మద్యం తాగడంతో తూగుతూ సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో కనిపించారు. అయితే, ఇలాంటి ప్రవర్తనతో తరచూ వార్తల్లో నిలుస్తుండటంతో ఆయన్ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు