రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే

ABN, Publish Date - Dec 09 , 2025 | 08:17 PM

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 1/10

ఇండస్ట్రీలో మొన్నటివరకు విడాకుల ట్రెండ్ నడిచింది. ఇప్పుడు కొత్తగా ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి క్యాన్సిల్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నస్టార్స్ అంటే వీరే..

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 2/10

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీతో కొన్నేళ్లు డేటింగ్ చేసి, ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ అయ్యాక.. కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వలన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం సల్లూ భాయ్ సింగిల్ గానే ఉన్నాడు.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 3/10

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంగేజ్ మెంట్ హీరో రక్షిత్ శెట్టితో గ్రాండ్ గా జరిగిన విషయం అందరికీ తెల్సిందే. అయితే కొన్ని కారణాల వలన వారిద్దరూ ఈ ఎంగేజ్ మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈమధ్యనే రష్మిక - విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం కూడా తెల్సిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 4/10

ఇక బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కి హీరోయిన్ కరిష్మా కపూర్ తో మొదట ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకున్నారు. ఆ తరువాత అభిషేక్ .. ఐశ్వర్య రాయ్ ని వివాహాం చేసుకున్నాడు.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 5/10

అక్కినేని వారసుడు అఖిల్.. మొదట శ్రేయా రెడ్డిని ప్రేమించి, ఆమెతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. కానీ, పెళ్లి కొద్దిరోజుల్లో ఉంది అనగా తమ నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్నట్లు అక్కినేని కుటుంబం ప్రకటించింది. ప్రస్తుతం వీరిద్దరూ వేరొకరిని వివాహాం చేసుకొని సంతోషంగా ఉన్నారు.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 6/10

అందాల భామ త్రిష కృష్ణన్.. చెన్నై బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్ ఎంగేజ్ మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఆ తరువాత ఏమైందో తెలియదు.. ఆ నిశ్చితార్దాన్ని త్రిష క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉంది.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 7/10

టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా.. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్ ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ తరువాత ఈ జంట తమ ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రస్తుతం మెహరీన్ సింగిల్ గా ఉంటుంది.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 8/10

హీరో విశాల్ మొదట అనీషా రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. త్వరలో పెళ్లి అనగా వీరిద్దరూ తమ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యనే విశాల్ కి.. నటి ధన్సికతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 9/10

స్టార్ క్రికెటర్ స్మృతీ మంధనా.. పలాష్ మచ్చల్ తో రెండు రోజుల్లో పెళ్లి అనగా తన తండ్రికి గుండెపోటు వచ్చిందని పెళ్లి ఆపేసింది. ఆ తరువాత పలాష్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ ని కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది.

రష్మిక To నివేతా పేతురాజ్! ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి ఆపేసిన స్టార్స్ వీరే 10/10

ఇక నేడు కోలీవుడ్ బ్యూటీ నివేతా పేతురాజ్ సైతం.. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ తో జరిగిన నిశ్చితార్దాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది.

Updated at - Dec 09 , 2025 | 08:59 PM