Tribanadhari Barbarik OTT: ఇన్నాళ్లకు.. ఓటీటీకి బార్బరిక్! ఇక్క‌డైనా చూస్తారా

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:36 PM

ఆగ‌స్టు నెల చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ తెచ్చుకున్నా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌న‌ను ద‌క్కించుకోని సెక‌లాజిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం త్రిబాణధారి బార్బరిక్.

Tribanadhari Barbarik OTT

ఆగ‌స్టు నెల చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ తెచ్చుకున్నా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌న‌ను ద‌క్కించుకోని సెక‌లాజిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). స‌త్య‌రాజ్ ( Satya raj), వశిష్ట ఎన్‌ సింహా (Vasista n Simha), ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్‌, సాంచీ రాయ్‌, మేఘన కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వ‌హ‌ఙంచ‌గా రాజాసాబ్ ద‌ర్శ‌కుడు మారుతి సమర్పించ‌గా వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్‌ మీద విజయ్‌ పాల్‌ రెడ్డి నిర్మించారు. సినిమా విడుద‌ల‌కు మునుపే పాటలు. ట్రైల‌ర్‌తో సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది కానీ ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేకపోయింది. దీంతో థియేట‌ర్ల‌కు ప‌బ్లిక్ రావ‌డం లేదంటూ ఈ ద‌ర్శ‌కుడు చెప్పుతో కొట్టుకోవ‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే అయింది. ఇప్పుడ ఈ సినిమా కాస్త ఆల‌స్య‌మైనా ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

కథ విష‌యానికి వ‌స్తే.. కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన) ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు డాక్టర్‌ శ్యామ్‌ కత్తు (సత్యరాజ్‌). అయితే ఆగ‌స్లు 15న స్కూల్‌కు వెళ్లిన మేఘ‌న కిడ్నాప్ అవుతుంది. దాంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా కానిస్టేబుల్‌ చంద్ర (సత్యం రాజేశ్)కు ఈ కేసును అప్పగించ‌డంతో శ్యామ్ , కానిస్టేబుల్ ఇద్ద‌రు క‌లిసి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. మరోవైపు రామ్‌ (వశిష్ట) విదేశాలకు వెళ్లి స్థిరపడాలని, తల్లిని బాగా చూసుకోవాలని కలలు కంటుంటాడు. కానీ వీసాకు స‌రిప‌డే డ‌బ్బు లేక పోవ‌డంతో మిత్రుడు ఒక ప్రాంతానికి డాన్‌గా ఉన్న వాకిలి పద్మకు మేనల్లుడు అయిన దేవ్‌ (క్రాంతి కిరణ్‌) ను సాయం కోర‌తాడు. ఇద్ద‌రు కలసి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకుంటారు. దాని కోసం వారేం చేశారు? తప్పిపోయిన నిధి ఏమయింది? నిధి మిస్సింగ్‌కు రామ్‌, దేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథకు బార్బరికుడికి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

Tribanadhari Barbarik OTT.jfif

కిడ్నాప్ అయిన మ‌నుమ‌రాలిని వెతికే క్ర‌మంలో డాక్టర్‌ శ్యామ్‌కు ఎలాంటి ప‌రిస్తితులు ఎదుర‌య్యాయి, చివ‌ర‌కు త‌న అచూకీ దొరికిందా లేదా, కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చిన విష‌యాలేంటి, రామ్, దేవ్‌లు డ‌బ్బు కోసం చేసిన పని ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింది అనే రెండు ఫ్యార్‌ల‌ల్ క‌థ‌ల‌ను చూయించారు. చివ‌ర‌లో ఈ ఉదంతం మొత్తాన్ని బార్బ‌రిక్ క‌థ‌తో ఎండ్ చేసిన విధానం ఆట్టుకుంటుంది. మ‌ధ్య‌లో లాగ్ స‌న్నివేశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు ఒక మారు చూడ‌చ్చు. ఇప్పుడీ త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik) చిత్రం ఆక్టోబ‌ర్ 10నుంచి స‌న్ నెక్ట్స్ (SUN NXT) ఓటీటీలో తెలుగుతో పాటు త‌మిళంలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Oct 05 , 2025 | 12:36 PM