Thalli Manasu - OTT: తల్లి మనసు ఓటీటీలో.. ఎక్కడంటే..
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:37 PM
ఓ తల్లి తపన, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన 'తల్లి మనసు' చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఓ తల్లి తపన, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన 'తల్లి మనసు' (Thalli Manasu) చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi), కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (muthyala subbayya) సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమయ్యారు.
కాగా థియేటర్ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ చిత్రం మరింత ఎక్కువ మంది కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువయ్యి, మంచి ఆదరణ చూరగొంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. 99/- రూపాయలు చెల్లించి, సినిమాను చూడవచ్చును" అని అన్నారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామని ప్రేక్షకులు చెప్పడం తమ యూనిట్ కు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారం ద్వారా మిగతా ప్రేక్షకులకు దగ్గరై, తాము ఏదైతే చిత్రం గురించి ఆశించామో ఆ లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.